కావలసిన పదార్ధాలు : బంగాళదుంపలు : అరకిలో పంచదార పొడి : 400 గ్రాములు నీళ్ళు : ఒక కప్పు కలాఖండ్ : 150 గ్రాములు నెయ్యి : 175 గ్రాములు ఎండుకొబ్బరి పొడి : 100 గ్రాములు ఎండు ఖర్జూరాలు : 50 గ్రాములు జీడిపప్పు : 50 గ్రాములు అల్లం మురబ్బా ముక్కలు : 50 గ్రాములు చెర్రీ పళ్ళు : 50 గ్రాములు ఎండు ద్రాక్ష : 25 గ్రాములు యాలకులు పొడి : అర టీ స్పూన్ లెమన్ ఫుడ్ కలర్ : పావు టీ స్పూన్ పచ్చ కర్పూరం పొడి : చిటికెడు తయారు చేసే విధానం : బంగాళాదుంపల్ని ఉడికించి పొడిలా చిదుముకోవాలి. అందులో ఎండుకొబ్బరి కోరు, కలాఖండ్, నెయ్యి, యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే జీడిపప్పును నేతిలో వేయించుకోవాలి. ఎండు ద్రాక్షలో గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ నీళ్ళలో పంచదార వేసి తీగ పాకం వచ్చేదాక కలబెట్టుకోవాలి. తర్వాత అందులో బంగాళాదుంప మిశ్రమాన్ని వేసి అట్లకాడతో కలుపుతూ సన్నని సెగ మీద కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమంలో వేయించిన జీడిపప్పు, అల్లం మురబ్బా ముక్కలు, ఎండు ద్రాక్షా, గింజలు తీసిన ఎండుఖర్జూరాలు వేసి బాగా కలిపాలి. తర్వాత ఒక ప్లేట్ లో నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులోకి వేయాలి. చిరవగా మరికొన్ని జీడిపప్పు, చెర్రీలు, ఎండు ద్రాక్షాలతో అలంకరించుకోవాలి. రుచికరమైన పొటాటో బర్ఫీ రెడీ. |
Tuesday, 11 June 2013
potato barfi telugu recipe
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment